అలాంటి వారికి మనుగడే ఉండదు:యనమల
close

తాజా వార్తలు

Published : 10/02/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటి వారికి మనుగడే ఉండదు:యనమల

అమరావతి: ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గపు చర్యని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులపై అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం ఇలా కక్ష సాధించడం గర్హనీయమన్నారు. ఈ మేరకు యనమల ట్వీట్‌ చేశారు. కులం, పార్టీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బలిపెడుతున్నారని.. ఉద్యోగులకు రాజకీయాలను ఆపాదించరాదని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన అధ్వాన స్థితికి చేరిందని.. ఇలాంటి కక్ష సాధింపు వైఖరితో ఏపీ సర్వనాశనమవుతుందన్నారు. అధికారులు, ఉద్యోగులపై వ్యక్తిగత కక్ష తగదని యనమల సూచించారు. 58 మంది డీఎస్పీలు, 100 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది అదనపు ఎస్పీలను 8 నెలలుగా వెయిటింగ్‌లో పెట్టడం దుర్మార్గమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల ఉనికికే ప్రమాదం..
ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు పాలనా ధర్మం కాదని.. ఒక వ్యక్తి తన వ్యక్తిగత కక్ష సాధింపునకు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని యనమల మండిపడ్డారు. ప్రజలపై కక్ష సాధించే పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామని.. ఉద్యోగులను బలికోరే పాలకుడికి మనుగడే ఉండదన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామన్న సీఎం జగన్‌ ప్రమాణం ఏమైందని యనమల నిలదీశారు. ‘నాకు నచ్చనివారిపై కక్ష సాధిస్తానని.. పగ, ప్రతీకారాలు తీర్చుకుంటానని..’ సీఎం జగన్‌ ప్రమాణం చేస్తే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాలు ఇటువంటి దుర్మార్గాలను అడ్డుకోవాలని యనమల పిలుపునిచ్చారు. బెదిరింపు రాజకీయాలకు అడ్డుకట్ట వేయకపోతే ఉద్యోగుల ఉనికికే ప్రమాదమన్నారు. అదే జరిగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని