అదానీ కంపెనీనీ తుగ్లక్‌ సేన తరిమేసింది: లోకేశ్‌
close

తాజా వార్తలు

Published : 19/02/2020 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదానీ కంపెనీనీ తుగ్లక్‌ సేన తరిమేసింది: లోకేశ్‌

అమరావతి: వైకాపా ప్రభుత్వం చేతగానితనం వల్లే అదానీ కంపెనీ ఏపీ నుంచి వెళ్లిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అధికారం చేపట్టిన 9 నెలల కాలంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేని వాళ్లు అదానీ సొంత అవసరాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోతోందనడం వారి చేతగానితనాన్ని బయటపెట్టుకోవడమేనని దుయ్యబట్టారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు కల్పించే అదానీ కంపెనీని తుగ్లక్ సేన తరిమేసిందని ఆక్షేపించారు. ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకు రావాల్సిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను  దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగస్తులను తరలించడం అభివృద్ధి వికేంద్రీకరణో.. యువతకి కొత్త ఉద్యోగాలు కల్పించడం అభివృద్ధి వికేంద్రీకరణో ఆలోచించాలని లోకేశ్‌ హితవు పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని