బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేసింది:యనమల
close

తాజా వార్తలు

Published : 06/03/2020 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేసింది:యనమల

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 24 శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ చర్యను బీసీలు, బీసీ సంఘాలు వ్యతిరేకించాలన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గాలకు చెందిన 15 వేల మందికి రాజకీయ అవకాశాలు రాకుండా వారి అభ్యున్నతిని సీఎం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని యనమల దుయ్యబట్టారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 60 శాతం రిజర్వేషన్ సాధించగా ఇప్పుడు జగన్ ఎందుకు ఆ పని చేయటం లేదని యనమల ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు ఇప్పటికే జగన్ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, అధికార బలంతో ఓటర్లను, ప్రతిపక్షాలను వైకాపా బెదిరిస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. తుగ్లక్ తరహాలో వ్యవహరిస్తోన్న వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని యనమల వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని