కరోనా నివారణకు చంద్రబాబు సూచనలు
close

తాజా వార్తలు

Updated : 18/03/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నివారణకు చంద్రబాబు సూచనలు

అమరావతి: ప్రపంచ దేశాలను వణికిస్తూ భారతదేశంలోనూ క్రమక్రమంగా విస్తరిస్తున్న కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ నియంత్రణకు తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంత తేలిగ్గా తీసుకున్నా ప్రజలు స్వచ్ఛందంగా అప్రమత్తత పాటించాలని సూచించారు. ఎవరికి వారు సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 6 అడుగుల దూరం పాటించి.. జనసమూహాలను నివారించాలని కోరారు. కుటుంబం పట్ల బాధ్యతతో ఉంటూ కొవిడ్‌-19పై ఎక్కువ అవగాహన కల్పించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు.

జగన్‌ అధికార దాహాన్ని వీడాలి..:లోకేశ్‌

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. దేశంలోని రాష్ట్రాలన్నీ కరోనా వైరస్‌ పట్ల పూర్తి అప్రమత్తతతో ఉన్నాయని.. అందులో భాగంగానే పాఠశాలలను మూసివేసి రద్దీ ప్రాంతాలను నివారిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం లేకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్‌ ఇప్పటికైనా తన అధికార దాహాన్ని వీడి ప్రజల ప్రాణాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని