close

తాజా వార్తలు

Published : 27/03/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేషన్‌కార్డులేని పేదలనూ ఆదుకోండి:ఉత్తమ్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ రూపంలో ప్రపంచం ఒక విపత్తును ఎదుర్కొంటోందని.. మానవ జాతినే ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని.. 21రోజులు ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆయన మాట్లాడారు. చైనాలో మొదలైన ఈ వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తోందన్నారు. సామాజిక దూరంతో పాటు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని ఉత్తమ్‌ సూచించారు. కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో ప్రజలకు సహాయంగా నిలబడాలన్నారు.

తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు వెంటనే అందివ్వాలని.. తెల్లరేషన్‌ కార్డు లేని పేదలను గుర్తించి వారినీ ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసరాలకు కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో రైతుల నుంచి వెంటనే ఉత్పత్తులను కొనుగోలు చేసి నగదు చెల్లిస్తే వారికి కాస్త ఊరట లభిస్తుందని చెప్పారు. సమాచారలోపంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తమ్‌ సూచించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని