కరోనా నియంత్రణకు నారా లోకేశ్‌ చిట్కా
close

తాజా వార్తలు

Published : 29/03/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నియంత్రణకు నారా లోకేశ్‌ చిట్కా

అమరావతి: కరోనా వైరస్‌ నియంత్రణకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రజలకు ఓ చిట్కా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. అలవాటుగా ఉపయోగించే చేతిని ఎక్కువగా వాడకపోవటంతో కరోనాను కొంతమేర నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కుడిచేతి వాటం వాళ్లు ఎడమచేతితో.. ఎడమచేతి వాటం వాళ్లు కుడిచేత్తో తలుపులు తియ్యడం లాంటి పనులు చేయాలని సూచించారు. తద్వారా ఆ చేతితో ముఖాన్ని తాకడం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిన్న జాగ్రత్త కొంత వరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుందని చెప్పారు. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమేనని.. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలలుపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో ఈ తరహా చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారని ఈ సందర్భంగా లోకేశ్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని