close

తాజా వార్తలు

Published : 14/04/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అత్యవసర ఉద్యోగులకు ఇన్సెంటివ్‌ ఇవ్వాలి’

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: బీపీఎల్‌ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయం ఇప్పటి వరకు అందలేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దానితో కలిపి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. వలస కూలీల కోసం 200 ఫుడ్‌ సెంటర్లు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని నిలదీశారు. మీడియా పట్ల సీఎం కేసీఆర్‌ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  దేశంలో 27 రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారని.. తెలంగాణలో అలా ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వలేదన్నారు. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు 50 శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 15 లేదా 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని