లాక్‌డౌన్‌: దీదీపై గవర్నర్‌ తీవ్ర వ్యాఖ్యలు
close

తాజా వార్తలు

Published : 15/04/2020 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌: దీదీపై గవర్నర్‌ తీవ్ర వ్యాఖ్యలు

కోల్‌కతా: కరోనా కట్టడిలో విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెళ్లగొట్టాలంటూ పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ నేడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం భౌతిక దూరం అమలు, మత సమావేశాల నివారణ తదితర అంశాలలో పూర్తిగా విఫలమైందని గవర్నర్‌ విమర్శించారు. వారికి చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి పారామిలిటరీ దళాలను రప్పించుకోవాలని ఆయన దీదీకి సలహా ఇచ్చారు.

‘‘కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలంటే లాక్‌డౌన్‌ నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయాలి. రాష్ట్రంలో మమతా బెనర్జీతో సహా పోలీసులు, అధికారులు భౌతిక దూరం, మతపరమైన సమావేశాలు జరగకుండా చూడటం వంటి అంశాలు నూరు శాతం అమలు చేయటంలో విఫలమయ్యారు. ఇటువంటి వారికి బయటకు వెళ్లేందుకు ద్వారం చూపించాలి. లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేయటం తప్పనిసరి... ఇందుకు పారామిలిటరీ దళాలను అభ్యర్థించండి.’’ అని ఆయన ఓ ట్విటర్‌ ప్రకటనలో తెలిపారు. కాగా, గత సంవత్సరం జులైలో పదవిని స్వీకరించినప్పటి నుంచి గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌కు వివిధ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చుక్కెదురవుతున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని