close

తాజా వార్తలు

Published : 16/04/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాండ్లతో సేకరించిన నిధులేమయ్యాయి?:ఉత్తమ్‌

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు సాయం పేదలకు ఇప్పటికీ అందలేదని.. వలస కూలీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌-19 వల్ల రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 5కిలోల బియ్యం ఏమయ్యాయని.. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తోందా లేదా వేరుగా ఇస్తున్నారా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

సీఎం కేసీఆర్ తప్పుడు వ్యవహారశైలి వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంపాటు లాక్‌డౌన్ అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థికస్థితి చేరిందా అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం బాండ్ల రూపంలో సమకూర్చిన రూ.1500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరి పంట కోతకు వచ్చే సమయం తెలిసినప్పటికీ గోనె సంచులు సమకూర్చుకోకపోవడం ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అఖిలపక్ష సమావేశం ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోరారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని