యూపీ గురించి ఆందోళన వద్దు:ఆదిత్యనాథ్‌
close

తాజా వార్తలు

Published : 30/04/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీ గురించి ఆందోళన వద్దు:ఆదిత్యనాథ్‌

ముందు మహారాష్ట్ర సంగతి చూడాలని విమర్శ

ముంబయి: శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా బదులిచ్చారు. యూపీ గురించి బాధపడొద్దని ముందు మహారాష్ట్ర సంగతి చూసుకోవాలని విమర్శించారని. ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని ఉదహరించారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన సాధువుల హత్యలపై రౌత్‌ స్పందించారు. ‘భయానకం! యూపీలోని బులంద్‌షహర్‌లో ఇద్దరు సాధువులను హత్య చేశారు. అందరినీ నేను కోరేదొక్కటే. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ ఘటనను మత రాజకీయం చేసినట్టు ఇక్కడ చేయకండి’ అని ట్వీట్‌ చేశారు.

పాల్ఘర్‌లో సాధువులను మూకదాడి హత్య చేయడంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు యోగి ఫోన్‌ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. యూపీ ఘటన జరిగిన వెంటనే ఠాక్రే సైతం యోగికి ఫోన్‌ చేశారు. ఈ నేపథ్యంలో యోగి వరుస ట్వీట్లు చేశారు.

‘సంజయ్‌ రౌత్‌, మీ సైద్ధాంతిక దృష్టికోణంపై ఏమనాలి? పాల్ఘర్‌లో జరిగిన ఘాతుకానికి రాజకీయ ముద్ర వేస్తారా? మీ మాటలు, మీ నైతిక విలువలు, మారిన మీ రాజకీయ రంగులను ప్రతిబింబిస్తున్నాయి. ఇలాగే సంతృప్తి చెందుతారా? యూపీలో చట్టం ఉంది. చట్టాన్ని అతిక్రమించిన వారిని అది శిక్షిస్తుంది. బులంద్‌షహర్‌ ఘటన జరిగిన వెంటనే కఠిన చర్యలు తీసుకున్నాం. గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ముందు మహారాష్ట్ర సంగతి చూసుకోండి. ఉత్తర్‌ప్రదేశ్‌ గురించి ఆందోళన వద్దు’ అని యోగి అన్నారు.

చదవండి: వ్యాక్సిన్‌ తయారీకి కృత్రిమ మేధ సహకారం

చదవండి: రాహుల్‌.. చిదంబరంతో ట్యూషన్‌ చెప్పించుకో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని