‘మరణాలు దాచేస్తే కరోనా కాల్చేస్తుంది’
close

తాజా వార్తలు

Updated : 30/04/2020 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మరణాలు దాచేస్తే కరోనా కాల్చేస్తుంది’

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘వస్తుంది.. పోతుందనటానికి కరోనా ఏమైనా జగన్‌ చుట్టమా’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మరణాలు దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌పై వాస్తవాలను వైకాపా నేతలు తొక్కేస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కువ పరీక్షలు చేయటం వల్లే కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని చెప్పడం ఆత్మవంచనతో పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిపై మేధావులంతా తలలుపట్టుకుంటుంటే జగన్‌ మాత్రం కొవిడ్‌ వల్ల ప్రమాదం లేదన్నట్లుగా చెప్పడం సరికాదన్నారు. 

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన 15 జిల్లాల్లో కర్నూలు ఉందని పేర్కొన్నారు. సీఎం నిర్లక్ష్యం కారణంగానే మొదట్లో అధికార యంత్రాంగం కొవిడ్‌ను తేలిగ్గా తీసుకుందని ఆయన విమర్శించారు. కరోనా కేసుల్లో వృద్ధిరేటులో దేశంలో ఏపీ 2వ స్థానంలో ఉందన్న ఆయన.. త్వరలోనే తమిళనాడును అధిగమించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిన డిశ్చార్జి రేటులో తమిళనాడు 1,210తో తొలిస్థానంలో ఉంటే, తెలంగాణ 409తో 2వ స్థానం, కేరళ 369తో మూడో స్థానం, ఏపీ 287తో కింద నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. వైకాపా నాయకులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతూ వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతున్నారనే దానికి వారు నిర్వహించిన సమావేశాలే నిదర్శనమని యనమల ఆక్షేపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని