close

తాజా వార్తలు

Published : 05/05/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా టెస్టులెందుకు తగ్గించారు?:ఉత్తమ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా టెస్టులు ఎందుకు తగ్గించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సైతం విపక్షాలతో మాట్లాడుతుంటే.. తెలంగాణలో మాత్రం సీఎం ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఆక్షేపించారు. సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వివరించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపిన ఆస్పత్రుల్లో ఎందుకు పరీక్షలు చేయడంలేదని నిలదీశారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు సైతం ఎక్కువ పరీక్షలు చేస్తున్నాయన్నారు. చనిపోయిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే మీడియాను బెదిరించడం, ప్రతిపక్షం సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉత్తమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. 40 రోజుల లాక్‌డౌన్‌లో పేదలకు ప్రభుత్వం అందిస్తోన్న రూ. 1500 ఇంకా అందలేదని.. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొవాలని కోరినట్లు తెలిపారు. వలస కార్మికుల సంఖ్యపై ప్రభుత్వానికి స్పస్టత లేదన్నారు. మార్చి 15 తరువాత వచ్చిన వారికే బియ్యం, నగదు ఇస్తున్నారని.. అంతకుముందు వచ్చినవారు 

ప్రభుత్వ సాయం అందకపోవడంతో వారంతా వెళ్లి పోతున్నారన్నారు.
 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని