అది ‘బిల్డ్‌ ఏపీ’ కాదు ‘జగన్‌ కిల్డ్‌ ఏపీ’: లోకేశ్‌
close

తాజా వార్తలు

Published : 15/05/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది ‘బిల్డ్‌ ఏపీ’ కాదు ‘జగన్‌ కిల్డ్‌ ఏపీ’: లోకేశ్‌

అమరావతి: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ‘బిల్డ్‌ ఏపీ’ పేరుతో కొత్త పథకానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు పలువురు నేతలు ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి సీఎం జగన్‌ మిషన్‌ ‘బిల్డ్‌ ఏపీ’ పేరు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఈ కార్యక్రమం పేరు ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ కాదని ‘జగన్‌ కిల్డ్‌ ఏపీ’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జగన్‌ ఉన్మాది కొడుకులా వ్యవహరిస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు.

జగన్‌ నేతృత్వంలో వైకాపా ప్రభుత్వం మరో భారీ దోపిడీలో భాగమే ‘బిల్డ్‌ ఏపీ’ అని మరో నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంటే జగన్‌ మాత్రం దోపిడీకి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కరోనాను అడ్డుపెట్టుకుని చీకటిమాటున ప్రతి అంశంలోనూ దోపిడీకి తెరలేపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఇసుక, ఇతర ఖనిజాలు, మద్యం వంటి దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నచ్చిన వ్యక్తులకు భూములు కట్టబెట్టే కుట్రలో భాగమే ఈ ‘బిల్డ్‌ ఏపీ’ పథకమని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రాన్ని నిర్మిస్తామనే పేరుతో అమ్మకం ఎలా చేపడతారని నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. దోపిడీకి ఇది సమయమేనా అన్నది సీఎం జగన్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన హితవు పలికారు. 
విశాఖలో జగన్ దోచుకున్న వేలాది ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం మిషన్‌ బిల్డ్‌ ఏపీ తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆక్షేపించారు. సంపద సృష్టి చేతకాక ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను అమ్మే అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. కోట్లు పెట్టి తెచ్చుకున్న సలహాదారుల సలహాలు ఇవేనా అని ఆయన నిలదీశారు. ఇది బిల్డ్‌ ఏపీనా లేక సెల్‌ ఏపీనో ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని