ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా: తెదేపా
close

తాజా వార్తలు

Updated : 16/05/2020 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా: తెదేపా

కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కోరుకొండలో చేపట్టిన ఆవ భూముల సేకరణ వివాదాస్పదంగా మారింది.  ఏడాదిలో దాదాపు ఆరేడు నెలలు ముంపునకు గురై నీటిలోనే ఉండే ప్రాంతాలను పేదల ఇళ్ల కోసం సేకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు శనివారం ఉదయం  తెదేపా బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది.

తెదేపా నేతలు నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు  కోరుకొండ చేరుకుని ఆవ భూములను పరిశీలించారు. లోతట్టు ప్రాంతంలో 42వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతంలో ఇళ్లు నిర్మించడానికి అనువుకాదని ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎకరం రూ.7లక్షలు ఉండే ప్రాంతంలో ఎకరం భూమి రూ.45లక్షలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని  ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సహకారంతో రూ.కోట్లు చేతులు మారాయని తెదేపా నేతలు ఆరోపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని