‘ఏపీలో అభివృద్ధి నిల్‌- అవినీతి ఫుల్’
close

తాజా వార్తలు

Published : 09/06/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏపీలో అభివృద్ధి నిల్‌- అవినీతి ఫుల్’

జగన్‌ ప్రభుత్వంపై యనమల

అమరావతి: ఏడాది కాలంలో జగన్‌ తెచ్చింది మాఫియా రాజ్యమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని.. దొంగల పాలన అని ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..

‘‘జగన్‌ ఏడాది పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత రావడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని రికార్డెడ్‌ వీడియోల్లో జగన్‌ ఊదరగొట్టడమే తప్ప.. ప్రజల్లోకి రావడం లేదు. ఏడాది పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై జనం నిలదీస్తారనే సీఎం జగన్‌ తప్పించుకుని తిరుగుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసే వైకాపా ఎమ్మెల్యేలు కూడా జగన్‌ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ‘అభివృద్ధి నిల్‌- అవినీతి ఫుల్’ అని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో చెబుతోంది. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంటోంది కూడా అదే’ అని యనమల విమర్శించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని