close

తాజా వార్తలు

Published : 04/12/2020 07:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన పేరు నిలుస్తుందా..!

తమ పరిధిలోని డివిజన్లపై ఎమ్మెల్యేల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌

ఏం జరగబోతుందో..? అధిష్ఠానం వద్ద మంచి మార్కులు దక్కుతాయో.. లేదో అంటూ కొందరు శాసనసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పరిధిలోని డివిజన్లలో అన్నిచోట్లా గులాబీ జెండా ఎగిరితే సరి.. లేదంటే ఆ ప్రభావం తమ రాజకీయ భవిష్యత్తుపై పడుతుందేమోనని హైరానాకు గురవుతున్నారు. ఈసారి ఎన్నికలు తెరాసకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గతంలో కంటే ఎక్కువ డివిజన్లను గెలుచుకోవాలన్న పట్టుదలతో అడుగు ముందుకేసింది. ఆ బాధ్యతను స్థానిక శాసనసభ్యులపై ఉంచిన విషయం తెలిసిందే.

సహకరించాల్సిందేనని స్పష్టీకరణ

కొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, సిట్టింగ్‌ కార్పొరేటర్లకు పొసగలేదు. ఈ పరిస్థితుల్లో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యేలు యత్నించారు. అతి కొద్దిమందికే ఇప్పించుకోగలిగారు. సిట్టింగులకే పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇవ్వడం అందుకు కారణం. ఎమ్మెల్యేలు తమ అనుచరులను గెలిపించుకోవడం పైనే ప్రధానంగా దృష్టి సారించారని, తమకు సహకరించలేదని అధిష్ఠానం దృష్టికి కొందరు అభ్యర్థులు తీసుకెళ్లారు. అప్రమత్తమైన ముఖ్య నాయకులు ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిచేశారు.

ఒక్కొక్కరు.. ఒక్కోలా...

* ఆ కుటుంబానికి మరోసారి కార్పొరేటర్‌ టిక్కెట్‌ దక్కకుండా ఓ ఎమ్మెల్యే ప్రయత్నించారు. అయితే టికెట్‌ వారికే దక్కింది. మొదట్లో ఎమ్మెల్యే సహకరించలేదు. విషయం తెలుసుకుని పార్టీ ముఖ్యనేత హెచ్చరించడంతో ఆ అభ్యర్థి గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. గెలిస్తే సరి.. లేదంటే అధిష్ఠానం వద్ద చెడ్డ పేరొస్తుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు.

 

* మరో ఎమ్మెల్యే పట్టుబట్టి తన బంధువుకు టిక్కెట్‌ ఇప్పించుకొన్నారు. గెలిపించి బహుమతి ఇస్తానంటూ శపథం చేశారు. అక్కడేమో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రత్యర్థి పుంజుకోవడంతో ఏమవుతుందోనన్న గుబులు పట్టుకొంది.

* మరో ఎమ్మెల్యే సిట్టింగులను పక్కన పెట్టించి, తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకొన్నారు. గెలిపించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ఒక్క డివిజన్‌లో ఓడిపోయినా తన మాట పోతుందని, ఆ ప్రభావం 2023 ఎన్నికల్లో పడుతుందంటూ వాపోతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన