close

తాజా వార్తలు

Updated : 06/03/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి.. ఎమ్మెల్యే వాగ్వాదం

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్ర మంత్రి, రాజధాని పరిధిలోని ఒక ఎమ్మెల్యే మధ్య శుక్రవారం హైదరాబాద్‌లో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన జిల్లాలో సదరు ఎమ్మెల్యే నిర్వహించిన కార్యక్రమం గురించి సమాచారం లేదని ఇటీవల ఆ మంత్రి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదుజేశారు. శుక్రవారం నగరంలో ఆ మంత్రి, ఎమ్మెల్యే ముఖాముఖిగా ఒక సమావేశం సందర్భంగా కలిశారు. తనపై ఫిర్యాదు గురించి ఎమ్మెల్యే మంత్రిని ప్రశ్నించినట్లు తెలిసింది. వారిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అక్కడే ఉన్న పార్టీ నేతలు వారికి సర్దిచెప్పడంతో వివాదం సమసింది. వారిద్దరు విడిగా అధిష్ఠానంతో భేటీ అయినట్లు తెలిసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని