రూ.27లక్షల జరిమానా కట్టిన కారు యజమాని
close

తాజా వార్తలు

Updated : 09/01/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.27లక్షల జరిమానా కట్టిన కారు యజమాని

అహ్మదాబాద్‌: సరైన పత్రాలు లేకపోవడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును తెచ్చుకునేందుకు సదరు  యజమాని భారీ మూల్యమే చెల్లించాడు. దేశంలో ఇప్పటి వరకు అత్యధిక మొత్తంలో జరిమానా చెల్లించిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది.

అహ్మదాబాద్‌కు చెందిన రంజిత్‌ దేశాయ్‌ అనే వ్యక్తి పోర్షే 911 స్పోర్ట్స్‌ కారును గతేడాది నవంబరులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కారును ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకోగా సరైన పత్రాలు లేకపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అహ్మదాబాద్‌ ఆర్టీవో అధికారులు కారు యజమానికి రూ.9.8లక్షల జరిమానా విధించారు. వాటిని చెల్లించేందుకు వెళ్లగా ఆ కారు పై ఉన్న పాత రికార్డులను పరిశీలించి ఆర్టీవో అధికారులు మొత్తం రూ.27.68లక్షలు జరిమానా చెల్లించాల్సిందిగా తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక కారు యజమాని ఆ మొత్తం చెల్లించి తన కారును తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ కారుకు నెంబరు ప్లేట్‌ లేదని, సరైన పత్రాలు లేకపోవడంతో రూ.9లక్షలు జరిమానా విధించినట్లు ట్వీట్‌ చేస్తూ కారు ఫొటోలను పోస్టు చేశారు. దేశంలో ఇప్పటి వరకు వసూలు చేసిన జరిమానా మొత్తాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని