రాజధానిలో ఇద్దరు రైతుల మృతి
close

తాజా వార్తలు

Updated : 19/01/2020 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధానిలో ఇద్దరు రైతుల మృతి

అమరావతి: రాజధానిలో మరో రైతు గుండె ఆగింది. అమరావతి పరిధిలోని  వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు(55) గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి 7 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన అప్పారావు అమరావతి తరలింపుపై గత కొన్నిరోజులుగా ఆందోళనతో ఉన్నారు. దీంతో పాటు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న తన కుమారుడు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తుండటంతో మనోవేదనతోనే అప్పారావు చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు.

గుండెపోటుతో మహిళా రైతు

అమరావతిలో మహిళా రైతు మృతి చెందింది. మందడం గ్రామానికి చెందిన బెజవాడ సామ్రాజ్యమ్మ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని అభివృద్ధికి ఈమెస్వచ్ఛంధంగా 20ఎకరాలు ఇచ్చారు. రాజధాని అమరావతి తరలిపోతుందని ఆవేదనతో మృతి చెందినట్లు  బంధువులు ఆరోపిస్తున్నారు. అమరావతి కోసంచేస్తున్న ఆందోళనల్లో సామ్రాజ్యం కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. సామ్రాజ్యం కుమారుడు గోపాలరావును ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. కుమారుడినిపోలీసులు కొట్టారనే దిగులుతో కొద్ది రోజులుగా సామ్రాజ్యమ్మ మనస్తాపానికి గురైందని బంధువులు ఆరోపించారు. ఈ ఉదయం సామ్రాజ్యమ్మ గుండెపోటుతో  తుదిశ్వాస విడిచారు.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని