close

తాజా వార్తలు

అశ్లీల చిత్రాలు చూసేందుకే నెట్‌

నీతి ఆయోగ్‌ సభ్యుడు సారస్వత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
జమ్మూ-కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతకు సమర్థన

అహ్మదాబాద్‌: అవిభక్త జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణం రద్దు అనంతరం ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతను సమర్థిస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెట్‌ లేకపోవడం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావమేమీ పడలేదని, అక్కడివారు ఆన్‌లైన్‌లో ‘అశ్లీల చిత్రాలు’ చూడటం మినహా చేస్తోందేమీ లేదన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం కావడంతో ఆయన జమ్మూ-కశ్మీర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పారు. శనివారం గాంధీనగర్‌లో ‘ధీరూభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో సారస్వత్‌ మాట్లాడారు. ‘‘కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ లేకపోవడం వల్ల ఏం నష్టం జరిగింది? అయినా అక్కడ ఇంటర్నెట్‌పై ఏం చూస్తారు? అశ్లీల చిత్రాలు చూడటం తప్పించి చేసేదేముంది’’ అని వ్యాఖ్యానించారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఇటీవల జరిగిన నిరసనలపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. అక్కడ పనిచేస్తున్న అధ్యాపకుల్లో సగం మంది ‘కరడుగట్టిన వామపక్షవాదుల’ని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలపై జరుగుతున్న నిరసనలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. సారస్వత్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కశ్మీర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (కేసీసీఐ) దీన్ని ఖండించింది. ఇంటర్నెట్‌ నిలిపివేత వల్ల గత ఆరు నెలల్లో కశ్మీర్‌ లోయలో రూ.18వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేసీసీఐ అధ్యక్షుడు షేక్‌ ఆషిక్‌ పేర్కొన్నారు. సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి కూడా సారస్వత్‌పై మండిపడ్డారు.

వక్రీకరించారు.. క్షమించండి
విమర్శల నేపథ్యంలో సారస్వత్‌ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. ఇలాంటి వక్రీకరణ వల్ల కశ్మీర్‌ ప్రజల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరారు. కశ్మీరీల హక్కులకు, వారికి ఇంటర్నెట్‌ సేవలు కల్పించడానికి తాను వ్యతిరేకం కాదన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.