టెండర్‌ ఓటు పడితే.. రీపోలింగ్‌: నాగిరెడ్డి
close

తాజా వార్తలు

Published : 21/01/2020 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెండర్‌ ఓటు పడితే.. రీపోలింగ్‌: నాగిరెడ్డి

హైదరాబాద్: పురపాలిక ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించేందుకు  అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు.  పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులతోపాటు వివిధ పార్టీల నేతలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. అభ్యర్థుల గత చరిత్ర, ఆస్తులు, నేర చరిత్ర వివరాలను అందుబాటులో ఉంచుతామని నాగిరెడ్డి తెలిపారు. ఆ వివరాల ఆధారంగా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవచ్చని వివరించారు. టెండర్‌ ఓట్లు పడిన ప్రాంతాల్లో కచ్చితంగా రీపోలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

పురపాలిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నాగిరెడ్డి వెల్లడించారు. పోలింగ్‌ సిబ్బంది ఆయా కేంద్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందం ఎప్పటికప్పుడు పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేస్తుందని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని