close

తాజా వార్తలు

దయచేసి వినండి.. బస్సు ఎక్కండి..

 సొంత ఖర్చుతో సమాచార వ్యవస్థ ఏర్పాటు
  డ్రైవరు హుస్సేన్‌కు ఆర్టీసీ ఎండీ అభినందన

ఈనాడు, హైదరాబాద్‌, కేశవగిరి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఆపుతారో లేదో తెలియని పరిస్థితి. ఒక వేళ బస్టాపులో ఆటో ఉంటే.. రోడ్డు మధ్యనే బస్సును ఆపీ ఆపనట్టు లాగించేసే డ్రైవర్లు ఉన్న వేళ.. ఫరూక్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ మహ్మద్‌ సర్వర్‌ హుస్సేన్‌ వినూత్న శైలిలో విధులు నిర్వహించి ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్నారు. రూటు నంబరు 2 మార్గంలో వెళ్లే బస్సులో సొంత డబ్బులతో ఓ ప్రీ రికార్డెడ్‌ మైక్‌ సెట్టును బస్సుకు అమర్చాడు. రూటు వివరాలను చెప్పడంతో పాటు.. ఏ బస్టాపులో బస్సు ఆగుతుందో వినిపిస్తున్నాడు.. అచ్చం మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ మాదిరి. స్టేజీ వద్దకు రాగానే రూటు వివరాలు తెలుసుకుంటున్న వారు  డ్రైవరును కొనియాడుతున్నారు. అంతే కాదు.. ఈ బస్సు కోసం ఎదురుచూసి అందులోనే ప్రయాణిస్తున్నారు. భద్రమైన ప్రయాణం, ఎక్కడ ఆగుతుందో,  ఏ మార్గంలో వెళ్తోందో తెలిపే వ్యవస్థను పెట్టి.. ప్రయాణికుల మన్ననలు పొందడమే కాదు.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ అభినందనలు పొందారు. డ్రైవర్‌ హుస్సేన్‌ ఆలోచన విధానం స్ఫూర్తి దాయకమంటూ డ్రైవర్స్‌ డే సందర్భంగా ఆయనను అభినందించారు. డ్రైవరు చేసిన ఈ ప్రయత్నంతో ఒక్క రోజులో రూ.వెయ్యి ఆదాయం ఆర్టీసీకి పెరిగిందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హుస్సేన్‌ను సముచితంగా గౌరవించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.