శంకర్‌కు భూకేటాయింపుపై హైకోర్టు నోటీసులు
close

తాజా వార్తలు

Updated : 31/01/2020 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంకర్‌కు భూకేటాయింపుపై హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో.. సినీ దర్శకుడు, నిర్మాత ఎన్‌.శంకర్‌కు ఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఐదెకరాలను కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఆయనకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ఏడాది జూన్‌ 21న సర్కారు జారీ చేసిన జీవో నం.75ను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాలకు చెందిన జె.శంకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజిస్టర్‌ విలువ ఎకరాకు రూ.20 లక్షలుందని, మార్కెట్‌ విలువ రూ.5 కోట్ల దాకా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సంబంధిత భూమిని ఎన్‌.శంకర్‌కు కేటాయించిందన్నారు. ధర్మాసనం ప్రతివాదులైన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, సీసీఎల్‌ఏలతో పాటు దర్శకుడు, నిర్మాత ఎన్‌.శంకర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని