మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్‌
close

తాజా వార్తలు

Published : 31/01/2020 13:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్‌

హైదరాబాద్‌: ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు తన బదులు సహ నిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన కోరారు. ఈ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపుపై నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టు నిరాకరించడంతో జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. సీఎంగా ప్రతి నిమిషం రాష్ట్రాభివృద్ధికి కేటాయించాల్సి ఉన్నందున ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల్లో సీబీఐ, ఈడీ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల్లో 11 ఛార్జిషీట్లు, ఈడీ కేసుల్లో 5 ఛార్జిషీట్లు నమోదయ్యాయి. వీటిపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. తాజాగా ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపుపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఈరోజు జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఎన్‌.శ్రీనివాసన్‌, అయోధ్య రామిరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌, రాజగోపాల్‌, కృపానందం శుక్రవారం విచారణకు హాజరయ్యారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని