ఏనుగును సింపుల్‌గా బయటకు తీశారు...
close

తాజా వార్తలు

Published : 01/02/2020 22:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏనుగును సింపుల్‌గా బయటకు తీశారు...

గుమ్‌లా (ఝార్ఖండ్‌): ఓ గున్న ఏనుగు బావిలో పడిపోయింది. ఇరుకుగా ఉండే ఆ బావి నుంచి దానిని తీయడానికి ఆ గ్రామస్థులు ఉపయోగించిన తెలివితేటలు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. ఏనుగుకు చిన్న గాయం కూడా కాకుండా దాన్ని వారు రక్షించడం విశేషం.

ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్‌లా గ్రామంలో జరిగిన ఈ సంఘటన గురించి ఓ అటవీ అధికారి ట్విటర్‌లో షేర్‌ చేశారు. గ్రామ ప్రజలు, అటవీ అధికారులు కలిసి ఆర్కెమిడీస్‌ సూత్రం సహాయంతో ఆ బుల్లి ఏనుగును ఎలా బయటకు తీసింది ఆయన వివరించారు. బావిలో పడిన ఏనుగును బయటకు తీయటానికి వారు ఆ బావిని నీటితో నింపారు. దీంతో ఆ ఏనుగు ఈతకొట్టుకుంటూ బావి నుంచి బయటపడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని