close
Array ( ) 1

తాజా వార్తలు

అతడు.. ఆమె..ఓ బుడతడు..!

 

సమయం..
అర్ధరాత్రి 12.30గంటలు
ఆయన..
బారులో మద్యం మత్తులో ఉన్నాడు
ఆ సమయంలో ప్రియురాలు గుర్తుకొచ్చింది
వాహనాన్ని ఆమె ఇంటి వైపు దూకించాడు
ఇంటికి వెళ్లి తూగుతూనే తలుపు తట్టాడు.!!
బుడతడు..
అతగాడిని చూసి ప్రవేశానికి అడ్డు తగిలాడు.
ఆగ్రహించిన ఆయన చేయిచేసుకున్నాడు
చిన్నారి రోదిస్తూనే 100కు సమాచామిచ్చాడు.
పోలీసులు వచ్చి ప్రియుడిని పట్టుకున్నారు..!!
ఆ వివరాలలోకి వెళితే..

వారి కథ ఇదీ: ఆయనది తాడిగడప గ్రామం. ఓ కార్పొరేట్‌ కళాళాలలో వంటమేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆమెది పోరంకి గ్రామం. ఇద్దరూ అదే కళాశాలలో వంట పనులు చేస్తున్నారు. వారు కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి పోరంకికి వచ్చిన ఆయన ఓ బార్‌లో అర్ధరాత్రి వరకు మద్యం తాగాడు. ఆసమయంలో ఆమె గుర్తుకు రావడంతో ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసి విషయం గమనించిన ఆమె   కుమారుడి(11)పై అసభ్యకరంగా మాట్లాడుతూ దాడి చేశాడు. దీంతో ఆ చిన్నారి పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించాడు.

కథ నడిచిందిలా: పెనమలూరు ఎస్‌ఐ తమ్మి నాయుడు ఆరుగురు కానిస్టేబుళ్లతో ఐదు నిమిషాల్లో పోరంకిలోని ఆమె ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. నేరుగా  తలుపు తట్టగా బాలుడు తలుపులు తీసి కన్నీటితో ఓ గది వైపు చేయి చూపించాడు. లోనికి వెళ్లిన ఎస్‌ఐ, సిబ్బంది మందుబాబును అర్ధనగ్నంగానే బయటకు ఈడ్చుకు వచ్చారు. దీంతో తొలుత బిత్తర పోయిన అతగాడు తర్వాత పోలీసులకు అడ్డం తిరిగాడు. తనకు ప్రముఖ మాజీ ప్రజాప్రతినిధి తెలుసనంటూ గొప్పలు చెబుతూ బెదిరింపులకు దిగాడు. ఎస్‌ఐపై తిరగబడ్డాడు. తాను తెచ్చుకున్న ద్విచక్రవాహనంపై పరారయ్యేందుకు ప్రయత్నం చేయడంతో ఎస్‌ఐ వెంటబడి పట్టుకొని అతడ్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తనదైన శైలిలో విచారించగా అసలు నిజం కక్కాడు.
బాలుడికి భరోసా:  సమాచారం ఇచ్చిన బాలుడికి పోలీసులు భరోసా ఇచ్చారు. ధైర్యంగా డయల్‌ 100కి ఫోన్‌ చేసినందుకు ఆ చిన్నారిని అభినందించారు.
తరలివచ్చిన స్థానికులు: ఈ రగడకు పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకొన్నారు. వారు మందుబాబుపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అతన్ని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

  --న్యూస్‌టుడే, పెనమలూరు.

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.