ఈ 72 ఏళ్ల  నారాయణ... మహాబలుడు
close

తాజా వార్తలు

Updated : 17/02/2020 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ 72 ఏళ్ల  నారాయణ... మహాబలుడు

విజయనగరం: సూపర్‌ మ్యాన్‌, హీమ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌, హల్క్‌ వంటి సూపర్‌ హీరోల పేర్లు వింటేనే పిల్లలకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇందుకు కారణం ఆ హీరోలు చేసే అనితర సాధ్యమైన సాహస కార్యాలే. వాళ్లు పదిమంది కూడా మోయలేని పెద్ద పెద్ద బరువుల్ని అవలీలగా ఎత్తేస్తుంటారు. కొండల్ని పిండి చేసేస్తుంటారు. అయితే తెరపై కనిపించే ఆ సాహసాల్ని నిజజీవితంలో కూడా చేస్తున్నారు విజయనగరానికి చెందిన 72 ఏళ్ల పెద్ది లక్ష్మీనారాయణ... విజయనగరం వాసి. దేహదారుఢ్యం, బల ప్రదర్శనలకు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చిన కోడి రామ్మూర్తికి అభిమాని. ఒక కారు ఇంచుమించు రెండు టన్నుల బరువుంటుంది. ఇటీవల కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవాల్లో 400 హార్స్‌పవర్‌ కలిగిన రెండు అంబాసిడర్‌ కార్లను తాళ్లతో నిలువరించారు. అసలు 50 ఏళ్లు దాటినా బలప్రదర్శనల్లో పాల్గొనడం ఓ విశేషం.

‘కలియుగ భీముడు’ కోడి రామ్మూర్తి నాయుడి స్ఫూర్తితోనే ప్రదర్శనలు కొనసాగిస్తున్న ఈయన శరీర దృఢత్వం, శ్వాసపై నియంత్రణ కోసం నిత్యం వ్యాయామం, యోగా చేస్తారు. రోజూ బరువులు ఎత్తడాన్ని సాధన చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా బలశాలిగా గుర్తింపు తెచ్చుకుని ...అవలీలగా 200 కిలోల వరకు బరువులు ఎత్తుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని