close
Array ( ) 1

తాజా వార్తలు

నాకు బతకాలని ఉంది... వాడు బతకనివ్వట్లేదు!

ఆత్మహత్యకు ముందు విద్యార్థిని రాసిన లేఖ వెలుగులోకి

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉంది.. కానీ బతకనివ్వట్లేదు వాడు.. తన గదికి రావాలంటున్నాడు... రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు.. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి... ఐలవ్‌యూ అమ్మా.. ఐ మిస్‌యూ అమ్మా.. అంటూ... ఓ యువతి ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లికి రాసిన లేఖ వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఈ నెల 12న ఇంటిదగ్గర ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు... చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేదీ తెలియరాలేదు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల వారు కోరుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.