వసుంధర పురస్కారాలు 2019.. ఫొటో గ్యాలరీ
close

తాజా వార్తలు

Updated : 29/02/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వసుంధర పురస్కారాలు 2019.. ఫొటో గ్యాలరీ

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2019 సందర్భంగా ‘ఈనాడు-వసుంధర’ వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళలకు ‘వసుంధర పురస్కారం’ అందించింది. ఆదర్శవంతమైన మహిళల్ని పరిచయం చేయడమే కాదు.. వారిని గౌరవించి సత్కరిస్తే పలువురికి స్ఫూర్తి ప్రదాతలవుతారని.... ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 2019 మార్చి 8న జరిగిన కార్యక్రమంలో తొమ్మిది రంగాలకు చెందిన 18 మంది మహిళలకు  వసుంధర పురస్కారం అందించి సత్కరించారు.

పురస్కార గ్రహీతలు వీరే..
* చైనా సంప్రదాయ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవీణ, పాతబస్తీ అమ్మాయి పరీహా తఫిమ్‌, పిన్నవయసులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మలావత్‌ పూర్ణకు ‘వసుంధర యువ’ పురస్కారం అందించారు.

* వ్యాపార రంగంలో లిఫ్ట్‌లు, ఎలివేటర్ల తయారీ రంగంలో ఉన్న బిందూ కూనాటికి, రైతులకు సాంకేతిక సాయమందిస్తూ అంకుర పరిశ్రమను నడిపిస్తోన్న జయ నల్లబోతులకు అవార్డు దక్కింది.

* వైద్య రంగంలో కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన డాక్టర్‌ పద్మావతి, హైదరాబాద్‌కు చెందిన గైనకాలజిస్టు డాక్టర్‌ వెంకట కామేశ్వరికి పురస్కారం అందించారు.

* సామాజిక రంగం నుంచి మమత రఘువీర్‌, ప్రసన్నశ్రీలు, క్రీడా రంగం నుంచి సింధు, సైనా పురస్కారం స్వీకరించారు.

* పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ సరిత, షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి, ఐజీ స్వాతి లక్రా, వినోద రంగం నుంచి నిర్మాత స్వప్నాదత్‌, దర్శకురాలు నందినీ రెడ్డి, చిన్నతెర నిర్మాత మల్లెమాల దీప్తి శ్యాంప్రసాద్‌ రెడ్డి, బుల్లితెర నటి హరిత, పాటల రచయిత్రి శ్రేష్ఠ, గాయని మంగ్లీలకు వసుంధర పురస్కారం లభించింది.

పురస్కార గ్రహీతల కథనాల క్లిక్‌ చేయండి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని