సాంకేతికలోపంతో నిలిచిపోయిన ‘వెంకటాద్రి’
close

తాజా వార్తలు

Published : 06/03/2020 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాంకేతికలోపంతో నిలిచిపోయిన ‘వెంకటాద్రి’

హైదరాబాద్‌: చిత్తూరు నుంచి కాచిగూడ రావాల్సిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సాంకేతికలోపం కారణంగా షాద్‌నగర్‌లో నిలిచిపోయింది. హైదరాబాద్‌ చేరుకోవాల్సిన ప్రయాణికులు ఉదయం నుంచి రైలులోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6గంటలకు కాచిగూడ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు షాద్‌నగర్‌లోనే ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోయారు. సాంకేతిక లోపంతో రైలు నిలిచిపోయిందని, మరమ్మతుల అనంతరం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని