కరోనా రెండో దశలోనే ఉంది: ఐసీఎంఆర్‌
close

తాజా వార్తలు

Published : 17/03/2020 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా రెండో దశలోనే ఉంది: ఐసీఎంఆర్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశలోనే ఉందని, ప్రస్తుతానికి సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్‌) స్పష్టం చేసింది. అయితే, అంతర్జాతీయ సరిహద్దులను ఎంత పకడ్బందీగా కట్టడి చేయగలమనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని ఐసీఎమ్‌ఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుందని అయినప్పటికీ సమూహ వ్యాప్తి దశ జరగదని కచ్చితంగా చెప్పలేమన్నారు. కరోనా లక్షణాలతో ఉన్నవారిని అంతర్జాతీయ విమానాల్లో తీసుకొచ్చామని, వారికి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కేవలం కరోనా ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మాత్రమే దీని బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 72 లాబోరేటరీల ద్వారా ఎప్పటికప్పుడు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మరో అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈవారం చివరినాటికి సిద్ధమయ్యే ఈ ల్యాబ్‌ల ద్వారా ఒకే రోజు 1,400 నమూనాలను పరీక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల సహాయంతో మరిన్ని శాంపిల్స్‌ పరీక్షించే వీలుంటుందని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని