ఏపీలో మరో రెండు రోజులు కర్ఫ్యూ?
close

తాజా వార్తలు

Updated : 22/03/2020 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో మరో రెండు రోజులు కర్ఫ్యూ?

కాసేపట్లో సీఎం జగన్‌ ప్రెస్‌మీట్‌

అమరావతి: కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు రోజులు కర్ఫ్యూ కొనసాగించే అవకాశంపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమాలోచనలు జరిపారు. జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చేవారిపట్ల కేంద్రం నిర్దేశించిన నియమాలను పాటించాలని ఆదేశించాలని జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులపై ఈ సమావేశంలో విస్తృతస్థాయిలో చర్చించారు.

కరోనా అనుమానిత కేసులకు ఐసోలేషన్‌ వార్డులు, చికిత్స సదుపాయాలు, ఔషధాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించనున్నారు. ఈ సమావేశంలోనే కర్ఫ్యూ కొనసాగింపుపై జగన్‌ ప్రకటన చేసే అవకాశముంది. 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని