
తాజా వార్తలు
‘గృహ నిర్బంధం’ ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు
సంగారెడ్డి అర్బన్ : విదేశం వెళ్లి వచ్చి.. స్వీయ గృహ నిర్బంధంలో ఉండకుండా బయట తిరుగుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పట్టణం మాధవనగర్ కాలనీకి చెందిన ఇమ్రాన్పాష(32) కుటుంబంతో కలిసి మక్కా యాత్రకు వెళ్లి ఇటీవల తిరిగొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో వారికి 14 రోజులపాటు ఇంట్లో ఉండాలని క్వారంటైన్ ముద్రలు వేసి పంపారు. నిబంధన పాటించకుండా అప్పటినుంచి జనంలో తిరుగుతున్న ఇమ్రాన్పాషాని అధికారులు పలుమార్లు హెచ్చరించారు. అయినా మార్పు లేకపోవడంతో బుధవారం కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపారు.
Tags :
జనరల్
జిల్లా వార్తలు