close

తాజా వార్తలు

Published : 26/03/2020 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దండుకుంటే..దండనే!

నిత్యావసరాల ధరలపై ఎస్వోటీ పోలీసుల దృష్టి
ఈనాడు, హైదరాబాద్‌

అనవసరంగా రోడ్డెక్కుతున్న వాహనదారులపై కొరడా ఝళిపిస్తూనే.. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న, కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. స్పెషల్‌ ఆపరేషన్స్‌ బృందాలను(ఎస్వోటీ) రంగంలోకి దించారు. వారు వ్యాపారులు, సూపర్‌ మార్కెట్ల నిర్వాహకులతో సమావేశమై క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకొని, తగు సూచనలు చేస్తున్నారు.

మూడు కేసులు నమోదు..
ప్రస్తుత పరిస్థితిని వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని, నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ భారీగా ఫిర్యాదులు అందటంతో ఎస్వోటీ పోలీసులు క్షేత్రస్థాయిలో నిఘా పెట్టారు.

ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలోని జయప్రకాష్‌ ట్రేడర్స్‌పై రాచకొండ ఎస్వోటీ, ఎల్బీనగర్‌ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి కేసు నమోదు చేశారు.
కూరగాయలను అధిక ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో మాదాపూర్‌ ఎస్వోటీ పోలీసులు కూకట్‌పల్లిలోని పోలిమార్స్‌ సూపర్‌ మార్కెట్‌పై దాడులు చేసి మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కులను అధిక ధరకు విక్రయిస్తున్న అల్వాల్‌లోని సాయి చంద్ర మెడికల్‌ షాప్‌ను బాలానగర్‌ ఎస్వోటీ సీజ్‌ చేసింది.

క్షేత్రస్థాయిలో మీ సమస్యలేంటి..?
నిత్యావసరాల కొరత తలెత్తకుండా చూడాలని పోలీసులు బుధవారం సంబంధిత వ్యాపారులు, సూపర్‌ మార్కెట్లు, ఆసుపత్రుల, ఫార్మసీల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సరకులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి.. పోలీస్‌ శాఖ తరఫున ఎలాంటి సాయం కావాలంటూ అడిగి తెలుసుకున్నారు. సరకు రవాణా వాహనాలకు పాసులను జారీ చేయాలని నిర్ణయించారు. దుకాణాల దగ్గర సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సూపర్‌ మార్కెట్ల ప్రవేశ ద్వారం వద్ద హ్యాండ్‌ శానిటైజర్లను ఏర్పాటు చేయాలని, దగ్గు, జలుబు తదితరాలతో బాధపడుతూ ఎవరైనా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.