close

తాజా వార్తలు

Published : 26/03/2020 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే ఏపీలోకి రానిస్తాం

అమరావతి: సరిహద్దుల్లో ప్రయాణికుల ఇబ్బందులపై గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ స్పందించారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులకు వైద్య బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు. సరిహద్దుల్లో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నల్గొండ అధికారులను కూడా కోరతామన్నారు. నిబంధనల ప్రకారం వారిని వెంటనే ఊర్లలోకి అనుమతించలేమని స్పష్టం చేశారు. క్వారంటైన్‌ గడువు తర్వాత మాత్రమే వారు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. క్వారంటైన్‌కు అంగీకరించే వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. రెవెన్యూ అధికారులను కూడా సరిహద్దు వద్దకు పంపిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే..
గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన వారితో మాట్లాడుతున్నాం. ముందస్తు సమాచారం లేకుండా హైదరాబాద్‌ నుంచి రావడం వల్లే సమస్యలు. క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దుల్లో ఆగిన వారితో సంయమనంతో మాట్లాడాలని పోలీసులకు సూచించాం. రెవెన్యూ అధికారులతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం’’ అని స్పష్టం చేశారు.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని