ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్లను దరి చేరనివ్వని వస్త్రం
close

తాజా వార్తలు

Published : 28/03/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రి ఇన్‌ఫెక్షన్లను దరి చేరనివ్వని వస్త్రం

 అభివృద్ధి చేసిన ఐఐటీ పరిశోధకులు 

దిల్లీ: ఆసుపత్రుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ల (హెచ్‌ఏఐ) బారినపడకుండా నివారించే ఒక ప్రత్యేక వస్త్రాన్ని దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) పరిశోధకులు తయారుచేశారు. తక్కువ ధరతోనే ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. వర్ధమాన దేశాల్లో ఆసుపత్రిపాలయ్యే ప్రతి వంద మంది రోగుల్లో పది మంది హెచ్‌ఏఐల బారిన పడుతున్నారని అంచనా. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న వేళ ఈ ఆవిష్కారానికి ప్రాధాన్యం ఏర్పడింది. పరిశోధకుల బృందం ఏడాది నుంచే ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఈ వస్త్రానికి ‘ఇన్‌ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్‌’ అని పేరు పెట్టారు. ఇది సాధారణ కాటన్‌ వస్త్రాన్ని.. ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించే వస్త్రంగా మారుస్తుంది. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన రసాయనాల్లో, నిర్దిష్ట పరిస్థితుల మధ్య ఈ కాటన్‌ వస్త్రాన్ని శుద్ధి చేశాం. ఫలితంగా ఈ వస్త్రానికి శక్తిమంతమైన క్రిమినాశిని సామర్థ్యం లభించింది’’ అని ఐఐటీలోని జౌళి, ఫైబర్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యుడు సామ్రాట్‌ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. అనేకసార్లు ఉతికిన తర్వాత కూడా ఈ వస్త్రానికి క్రిమినాశిని సామర్థ్యం పోదని చెప్పారు. ఈ వస్త్రంతో రోగులు, వైద్యులు, నర్సులు యూనిఫామ్‌ కుట్టించుకోవచ్చన్నారు. కర్టెన్లు, బెడ్‌షీట్లు తయారు చేయవచ్చని వివరించారు. ఈ ఉత్పత్తిని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసేందుకు ఎయిమ్స్‌తో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని