close
Array ( ) 1

తాజా వార్తలు

‘గొడుగు’తో కరోనాకు దూరం!

విశాఖపట్నం: కరోనా దరిచేరకుండా కట్టడి చేయడానికి ప్రతీ వ్యక్తికి గొడుగు బాగా ఉపయోగపడుతుందని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సామాజిక దూరానికి అనువైన సిద్ధాంతమని విశాఖకు చెందిన డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు తెలిపారు.

• సామాజికదూరంలో భాగంగా 3 అడుగుల దూరాన్ని కచ్చితంగా పాటించాలని, ఇది పూర్తిగా ఇతరుల మీద కూడా ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతీ ఒక్కరు గొడుగు వాడితే కచ్చితంగా ఒకరినుంచి మరొకరు కనీసం మీటరు దూరం పాటించొచ్చని తెలిపారు.

• ఒకవేళ ఎదుటివారు తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లను గొడుగు అడ్డుకుంటుందన్నారు. బయటినుంచి ఇంటికి రాగానే.. ఆ గొడుగును అరగంట ఎండలో ఉంచి, శానిటైజర్‌తో శుభ్రపరచొచ్చని తెలిపారు. రైతుబజార్లలో, దుకాణాల దగ్గర ఇలా చేయొచ్చన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.