close

తాజా వార్తలు

Published : 01/04/2020 06:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పిరిట్ తాగి యువకుడి మృతి

తణుకు, ఇరగవరం, న్యూస్‌టుడే: మద్యం దొరక్క స్పిరిట్‌ తాగిన ఘటనలో ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన ధర్నాల నవీన్‌ మూర్తిరాజు(22), అల్లాడి వెంకటేష్‌, ఇరగవరం మండలం కావలిపురానికి చెందిన పండూరి వీరేష్‌, తణుకు దుర్గారావు, కె.వెంకటదుర్గాప్రసాద్‌, విప్పర్తి శ్యాంసుందరం స్నేహితులు. వీరేష్‌ స్థానిక కెమికల్స్‌ కంపెనీలో గుమస్తాగా పని చేస్తుంటాడు. మార్చి 29న కంపెనీకి వచ్చిన స్పిరిట్‌ తీసుకొచ్చాడు. దాన్ని కావలిపురం చెరువు వద్ద శీతల పానీయంలో కలుపుకొని స్నేహితులంతా తాగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 30న కడుపులో మంటతో తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవీన్‌ మూర్తిరాజు మృతిచెందాడు. ఇదే సమస్యతో వెంకటేష్‌, వీరేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన