వైరస్‌కు యంత్రం అడ్డుకట్ట
close

తాజా వార్తలు

Published : 01/04/2020 06:44 IST

వైరస్‌కు యంత్రం అడ్డుకట్ట

నిజాంపేట, న్యూస్‌టుడే: ఉపరితలంపై ఉండే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా నగరానికి చెందిన దంపతులు జర్మీబ్యాన్‌ పేరుతో ఓ యంత్రాన్ని రూపొందించారు. ఇది నిమిషాల వ్యవధిలోనే గాలితో పాటు, వస్తువుల ఉపరితంపై ఉండే వివిధ సూక్ష్మ క్రిములతో పాటు కొవిడ్‌-19వంటి వైరస్‌లను నిరోధిస్తుందని రూపకర్తలు తెలిపారు.

రూ.60 వేల ఖర్చుతో..
కూకట్‌పల్లి వసంత్‌నగర్‌కు చెందిన జి.ఎస్‌.చక్రవర్తి, శిరీష దంపతులు ఎలీప్‌లోని ఓ ఎయిర్‌ ఫ్యూరిఫికేషన్‌ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. దాదాపు 15రోజుల పాటు కృషి చేసి రూ.60 వేల ఖర్చుతో ‘జర్మీ బ్యాన్‌’ యంత్రాన్ని రూపొందించారు. నగరంలోని ఛాతి ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో వారం పాటు ప్రయోగాత్మకంగా పనితీరును పరిశీలించారు. పచ్చకామెర్లు (జాండిస్‌) సోకిన నవజాత శిశువులను అతి నీలలోహిత (అల్ట్రా వైలెట్‌) కిరణాలు ప్రసరించే దీపాల కింద ఉంచుతారు. ఆ కిరణాలు గాలిలోని వైరస్‌, బ్యాక్టరీయాలను చంపుతాయి. జర్మీ బ్యాన్‌ యంత్రం తయారీలోనూ ఇదే సూత్రాన్ని అవలంబించినట్లు రూపకర్తలు తెలిపారు. యంత్రంలో ‘సి’ కేటగిరికి చెందిన 16 అల్ట్రా వయోలెట్‌ దీపాలను వినియోగించామని, 480 వాల్ట్స్‌ విద్యుత్తు వినియోగంతో యంత్రం పనిచేస్తుందని చెప్పారు. కింది భాగంలోని పెట్టెలో అమర్చిన మూడు రకాల కాంపోనేటర్స్‌లో గాలిని శుద్ధి చేసే ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందన్నారు. యంత్రం ఉన్న గదిలో కేవలం పావుగంట వ్యవధిలోనే అన్నిరకాల సూక్ష్మ క్రిములు చనిపోతాయని పేర్కొన్నారు. దీన్ని వినియోగించే సమయంలో గదిలో ఎవరూ ఉండకూడదని, ఒకవేళ ఉంటే అల్ట్రా వయోలెట్‌ కిరణాలు హాని చేస్తాయని చెప్పారు. యంత్రం పనితీరును నీతి ఆయోగ్‌ సంస్థ గుర్తించిందని వీహబ్‌ ఇంక్యూబేషన్‌ కేంద్రం చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జహీరుల్లా తెలిపారు. పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తయారీదారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని