
తాజా వార్తలు
విద్యుత్తు బిల్లుల వసూళ్లకు కరోనా షాక్
గృహ, వాణిజ్య విభాగాల్లో 28 శాతం తగ్గుదల
ఈనాడు, హైదరాబాద్
లాక్డౌన్ ప్రభావం గ్రేటర్లో విద్యుత్తు బిల్లుల వసూళ్లపై పడింది. ప్రతినెలా వందశాతం వసూళ్లు చేసే దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ మార్చి నెలకు సంబంధించి గృహ, వాణిజ్య విభాగాల బిల్లుల వసూలులో వెనకబాటు కనిపించింది. హెచ్‌టీ (హై టెన్షన్)బిల్లులను చాలా సర్కిళ్లు వందశాతం వసూళ్లు చేసినా.. ఎల్టీ (లో టెన్షన్) విభాగంలో 28 శాతం వరకు వసూళ్లు తగ్గాయి. 81 శాతం బిల్లులను మేడ్చల్ సర్కిల్లో వసూలు చేయగా.. రాజేంద్రనగర్ సర్కిల్లో అత్యల్పంగా 54 శాతం మాత్రమే వసూలయ్యాయి.
గ్రేటర్లో విద్యుత్తు పంపిణీ సంస్థకు సంబంధించి 9 సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 55 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా వీరి నుంచి వెయ్యి కోట్లకు పైగా విద్యుత్తు బిల్లులను వసూలు చేస్తుంటారు. పరిశ్రమలు, ఐటీ కార్యాలయాలు అధికంగా ఉండే మేడ్చల్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలోనే రూ.500 కోట్ల వరకు కరెంట్ బిల్లులు చెల్లిస్తుంటారు. మాల్స్ ఎక్కువగా ఉండే బంజారాహిల్స్, హబ్సిగూడ రెండు సర్కిళ్లలో కలిపి రూ.250 కోట్ల వరకు బిల్లులు వసూలు చేస్తుంటారు. హైదరాబాద్ సెంట్రల్, సౌత్, సరూర్‌నగర్, సికింద్రాబాద్ సర్కిళ్లన్నీ కలిపి రూ.300 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది.
ఎల్టీ విభాగంలోనే సమస్య..
ఎల్టీ విభాగంలోకి వచ్చే గృహ, వాణిజ్య విద్యుత్తు కనెక్షన్ల బిల్లులను ఆన్లైన్, ఈసేవ, విద్యుత్తు బిల్లుల కేంద్రాల్లో చెల్లిస్తుంటారు. ఈ విభాగంలో ఎక్కువగా బిల్లుల కేంద్రాల్లో చెల్లిస్తుండటంతో వీటి వసూళ్లు తగ్గాయి. ప్రజలు లాక్‌డౌన్‌తో బయటకొచ్చే పరిస్థితులు లేకపోవడంతో 20 శాతం మంది వరకు గృహ వినియోగదారులు బిల్లులు చెల్లించలేదు.
* ఆన్లైన్ కాకుండా ఎక్కువగా విద్యుత్తు కౌంటర్లు, ఈసేవల్లో చెల్లించే సర్కిళ్లులో ఈసారి కలెక్షన్లు బాగా తగ్గాయి. రాజేంద్రనగర్, హైదరాబాద్ సెంట్రల్లో ఇలాంటి పరిస్థితి ఉండటంతో వసూళ్లు అత్యల్పంగా ఉన్నాయని అధికారి ఒకరు విశ్లేషించారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
