
తాజా వార్తలు
చిత్తవుతున్న మత్తు బానిసలు
మద్యం, ఇతర పదార్థాలు లభించక వింత ప్రవర్తన
మానసిక వైద్యుల వద్దకు పరుగులు
కుటుంబ సభ్యులు నిఘా పెట్టాలంటున్న నిపుణులు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో మందుబాబులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మద్యం దొరకడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. మత్తుకు బానిసైనవాళ్లు ఒక్కసారిగా అది దొరక్కపోతే వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తుంది. మత్తు పదార్థాలు దొరక్కపోవడంతో కొందరు యువకులు వింతగా ప్రవర్తిస్తున్నారు. గతంలో 10 గ్రాముల మాదక ద్రవ్యాలకు రూ.300 నుంచి రూ.500 తీసుకునేవారని.. లాక్డౌన్ నేపథ్యంలో తాజా పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు పది నుంచి ఇరవై రెట్లు ధర పెంచేసి అమ్ముతున్నారని తెలుస్తోంది. మత్తుకు బానిసైవాళ్లు ఎలాగైనా కొనుగోలు చేసేందుకు దొంగతనాలకు సైతం తెగబడుతున్నారు. ఇంట్లో సామగ్రిని విసిరేయడం, అడ్డు చెప్పినవాళ్లపై చేయిచేసుకోవడం, బిగ్గరగా అరవడం చేస్తున్నారు. ఈ తరహా కేసులు ఒక్కరోజే 15 నుంచి 20 కేసులు ఆబ్కారీ శాఖ దృష్టికి వచ్చినట్లు సమాచారం. చాలా మంది మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. నాలుగు రోజులుగా ఈ తరహా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి వారి ప్రవర్తనపై కుటుంబ సభ్యులు ఓ కన్నేసి ఉంచాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
మత్తు నుంచి బయటపడే కాలం
- డా.కల్యాణ్‌చక్రవర్తి, మానసిక వైద్యనిపుణులునిరంతరం మాదక ద్రవ్యాలు వినియోగించేవారు, మద్యానికి అలవాటు పడినవారు అవి దొరక్కపోతే కంగారుపడిపోతుంటారు. చేతులు వణకడం, చెమట పట్టడం, ఆకలి చచ్చిపోవడం, నిద్రలేమి, ఒక చోట కుదురుగా కూర్చోకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. వింతగా ప్రవర్తించడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం లేదా ఎక్కువగా మాట్లాడటం, ముభావంగా ఉండటం లేదా ఎక్కువగా ఉద్రేకపడటం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రశాంత వాతావరణం కల్పించాలి. ఇంట్లోనే ఇతర అంశాలపై మనస్సు మళ్లించాలి. సంతోషకరమైన విషయాలు, మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుండాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది కాబట్టి ద్రవపదార్థాలు ఇస్తూ ఉండాలి. పోషక విలువలున్న ఆహారం అందించాలి. ఉద్రేకంగా ప్రవర్తిస్తున్నా.. ఓపికగా, సహనంతో వ్యవహరించాలి. ఇంట్లోవాళ్లు వీరిపై నిఘా పెట్టాలి. మత్తు నుంచి బయటపడేందుకు లాక్డౌన్ మంచి అవకాశంగా భావించాలి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
