దిల్లీ మర్కజ్‌కు వెయ్యికిపైగా వెళ్లారు:ఈటల
close

తాజా వార్తలు

Updated : 01/04/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ మర్కజ్‌కు వెయ్యికిపైగా వెళ్లారు:ఈటల

హైదరాబాద్‌: తెలంగాణ నుంచి 1000 మందికి పైగా దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వీరిలో 160 మంది మినహా అందరినీ గుర్తించామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్‌ జరగలేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మందికి ఇవాళ నెగటివ్‌ వచ్చిందని.. మరోమారు వారిని పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఇద్దర్ని డిశ్చార్జ్‌ చేసినట్లు చెప్పారు. 

డిశ్చార్జ్‌ అయినవారు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంటారన్నారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో ఆరుగురు మృతిచెందారని మంత్రి తెలిపారు. దిల్లీలోని మార్కజ్‌ గురించి ముందుగా కేంద్రానికి తామే చెప్పామని ఈటల పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు లాక్‌డౌన్‌ ప్రకటించింది తెలంగాణే అని గుర్తు చేశారు.  

ఇదీ చదవండి..

తబ్లిగి జమాత్‌కు 53మంది మేడ్చల్‌ వాసులుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని