మరో రెండు టీకాలపై పరీక్షలు
close

తాజా వార్తలు

Published : 03/04/2020 06:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో రెండు టీకాలపై పరీక్షలు

మెల్‌బోర్న్‌: కొవిడ్‌-19 నివారణకు ప్రయోగాత్మకంగా రెండు టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిపై పరీక్షలు మొదలుపెట్టారు. ఇక్కడి కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌వో) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. వైరస్‌ నుంచి మెరుగైన రక్షణ కోసం ఈ టీకాను ఎలా ఇవ్వాలన్నదానిపైనా వారు ఆలోచిస్తున్నారు. ఇంజెక్షన్‌ రూపంలో కండరాల్లోకి ఎక్కించాలా లేక ముక్కులో వేసుకునే స్ప్రేలా ఇవ్వాలా అన్నది పరిశీలిస్తున్నారు. ఈ టీకాలపై ప్రయోగాలకు మూడు నెలల సమయం పడుతుందని పరిశోధనలో పాలుపంచుకున్న ట్రెవర్‌ డ్రూ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని