రూ.వెయ్యికే థర్మల్‌ స్క్రీనింగ్‌ గన్‌
close

తాజా వార్తలు

Published : 03/04/2020 08:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.వెయ్యికే థర్మల్‌ స్క్రీనింగ్‌ గన్‌

అభివృద్ధి చేసిన ముంబయి నేవల్‌ డాక్‌యార్డ్‌

ఈనాడు, దిల్లీ ప్రవేశ ద్వారాల వద్దే ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రతలను పసిగట్టేలా ఇన్‌ఫ్రారెడ్‌ ఆధారిత సెన్సర్‌ను ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌ అభివృద్ధి చేసింది. సొంత వనరులతో తయారుచేసిన ఈ సాధనం ధర రూ.వెయ్యి మాత్రమే. ఇది చూపే ఉష్ణోగ్రతల్లో తేడాలు 0.02 డిగ్రీలను మించవు. చౌకలో అందుబాటులోకి వచ్చిన ఈ గన్‌ను ఎక్కువమంది భద్రతా సిబ్బందికి ఇవ్వవచ్చు. డాక్‌యార్డ్‌లోకి వచ్చినవారందర్నీ వేగంగా పరీక్షించడానికి వీలవుతోంది. 285 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నేవల్‌ డాక్‌యార్డ్‌కి నిత్యం 20వేల మంది సిబ్బంది వస్తుంటారు.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న డిజిటల్‌ థర్మల్‌ స్క్రీన్‌గన్‌ నాణ్యతను బట్టి రూ.15వేల వరకు ధర పలుకుతోంది. చౌకలో దొరికే వాటిలో అంత కచ్చితత్వం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని తాజా సాధనాన్ని తయారుచేశారు. ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్‌ను ఎల్‌ఈడీ తెరతో అనుసంధానం చేసి, దాన్ని 9వాట్ల బ్యాటరీతో కూడిన మైక్రో కంట్రోలర్‌తో జతచేశారు. ప్రస్తుతం డాక్‌యార్డ్‌ అవసరాలకే దీన్ని ఉపయోగిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని