వారిపై చర్యలు చేపట్టాలి: కిషన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 03/04/2020 08:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిపై చర్యలు చేపట్టాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: వైద్యులు, సిబ్బందిపై దాడికి పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. దాడులకు పాల్పడుతున్న వారిపై ఆయా రాష్ట్రాల డీజీపీలు చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో పోస్టుచేశారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనాతో మృతి చెందిన రోగి బంధువు దాడిచేయగా, నిజామాబాద్‌ జిల్లాలో వైద్య సిబ్బందిపై కొందరు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. 

అంబులెన్స్‌ను అడ్డుకున్న మత పెద్దలు..
 సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్నిరోజులుగా ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దిల్ల్లీ నుంచి అక్కడికి వచ్చిన వారిని ఆయన కలిశాడనే అనుమానంతో.. హోం క్వారంటైన్‌ ముద్ర వేసి స్వీయ గృహనిర్బంధంలో ఉండాల్సిందిగా స్థానిక అధికారులు సూచించారు. ఈ క్రమంలో గురువారం సూర్యాపేటలోని ఐసోలేషన్‌ కేంద్రానికి అంబులెన్సులో తీసుకెళ్తుండగా మత పెద్దలు అడ్డుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని