close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా సాకుతో...గర్భిణికి వైద్యం నిరాకరణ

మార్కాపురం గ్రామీణం: కరోనా సాకుతో నిండు గర్భిణికి వైద్యం నిరాకరించిన సంఘటన శనివారం మార్కాపురంలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన ఓ గర్భిణిని ఆమె భర్త, బంధువులు ప్రసవం నిమిత్తం శుక్రవారం స్థానిక జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు ‘మీ భర్త ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చారంటూ’.. ఆమెకు పరీక్షలు చేయకుండానే వెనక్కు పంపారు. దాంతో గత్యంతరం లేక ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆ విషయాన్ని బాధితులు స్థానిక ఓ స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకువెళ్లగా... వారు శనివారం వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్‌ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి వైద్యశాలను తనిఖీ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.