close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/04/2020 07:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ఆ ట్రాక్‌మెన్‌ ఎవరిని కలిశాడు?

వెంకటాద్రి ప్రయాణికులను అప్రమత్తం చేసిన అధికారులు

కాచిగూడ, న్యూస్‌టుడే: కరోనా బాధిత రైల్వే ట్రాక్‌మెన్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఎవరెవరిని కలిశాడనే విషయమై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. గత నెల 17న రాత్రి 8గంటలకు ఈ ట్రాక్‌మెన్‌ ఆగ్రా కంటోన్మెంట్‌ స్టేషన్‌ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 18న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లో దిగాడు. 7.10 గంటలకు ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కి 7.30 గంటలకు కాచిగూడకు చేరుకున్నాడు. రాత్రి 8.05 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కర్నూల్‌ వెళ్లాడు. కాచిగూడ స్టేషన్‌లో ఉన్న 35 నిమిషాలు ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్లాట్‌ఫాంలపై ఫలహారశాలలు, స్టాళ్ల నిర్వాహకులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇక ఈ ట్రాక్‌మెన్‌ టిక్కెట్‌ రిజర్వేషన్‌ లేకుండానే కర్నూల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. తొలుత ఎస్‌2 బోగీలో, తర్వాత ఎస్‌5 బోగీలో ప్రయాణించినట్లు విచారణలో తేలింది. ఎస్‌5 బోగీలో ప్రయాణించిన 77 మంది జాబితా సేకరించి వివరాలు తెలుసుకున్నారు. ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
Saket Pranamam
Farmechanz
HITS2020

Panch Pataka

దేవతార్చన