close
Array ( ) 1

తాజా వార్తలు

మాత్ర ఎక్కువైతే... చూపు తగ్గుతుంది!

రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఇవ్వడం ద్వారా కరోనాను దూరం చేయవచ్చునని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వైద్యులు దీనిని సిఫారసు చేస్తున్నారు. ఈ ఔషధం సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలు సాగుతూనే ఉన్నాయి. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపాలని సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌... మన ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి అడిగారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధం వాడకం, దాని సామర్థ్యంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

దీర్ఘకాలిక వ్యాధులు, వ్యాధి నిరోధక సమస్యలతో ఇబ్బందిపడే రోగులకు ఇచ్చేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు సురక్షితమే అయినప్పటికీ... ఈ ఔషధాన్ని మోతాదుకు మించి వాడితే నేత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హెచ్చు మోతాదులో సుదీర్ఘకాలం ఈ మందులను వాడటం వల్ల కొందరు రోగుల కళ్లలో రెటీనా చుట్టూ విషపూరిత పొర ఏర్పడినట్లు, చూపు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. మరికొందరిలో వికారం, వాంతులు, తిమ్మిర్లు, విరేచనాలు తదితర సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. కరోనా రోగులు ఈ మాత్రలను విచ్చలవిడిగా కాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడుతూ మోతాదుకు సంబంధించి జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.