జగిత్యాల క్వారంటైన్‌ నుంచి 85 మంది ఇంటికి
close

తాజా వార్తలు

Published : 08/04/2020 22:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగిత్యాల క్వారంటైన్‌ నుంచి 85 మంది ఇంటికి

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ క్వారంటైన్‌లోని 85 మందిని అధికారులు ఇళ్లకు పంపించారు. వీరిలో దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చినవారు 70 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అయితే వీరంతా ఈ నెల 21 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని కోరుట్లలో పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చెందిన 15 మంది కుటుంబసభ్యులు ఈ నెల 28 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కలెక్టర్‌ సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని