పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైకాపా ఎమ్మెల్యే ధర్నా
close

తాజా వార్తలు

Updated : 11/04/2020 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైకాపా ఎమ్మెల్యే ధర్నా

నెల్లూరు: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై పోలీసులు నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై  కేసు నమోదు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా తన అనుచరులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీసు స్టేషన్‌ ఎదుట ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. 

నిన్న బుచ్చిరెడ్డిపాలెం పాఠశాల వద్ద 6,500 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామాజిక దూరం పాటించకపోవడంతో జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనలు అతిక్రమించినందుకు ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురుపై 148, 188, 269, 270, 271 సెక్షన్ల కింద పోలీసులు కేసునమోదు చేశారు.

శనివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరులతో కలిసి గేటుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. స్వయంగా ఎస్పీ వచ్చి తమను అరెస్టు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని